రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యం

– పంటలను ఎండపెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌ ‌దే
-ఒక్క ఎక‌రానికి నీళ్లివ్వ‌లేదు
-వేల కోట్లు మింగిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి
– ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తాం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

దమ్మపేట, ప్రజాతంత్ర ,జనవరి 09 : పదేళ్ళ కాలంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పంటలకు నీరు ఇవ్వకుండా రైతులను మోసం చేసింద‌ని, నీరు పేరుతో కోట్ల రూపాయలకు కొల్లగొట్టారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రైతు సమ్మేళనంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.8500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని. గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు నాసిరకంగా నిర్మించటం వలన కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని, రైతులకు పెండింగ్‌ ‌బోనస్‌ ‌డబ్బులు త్వరలోనే జమ చేస్తామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నామని, సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయలేదని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి శ్రీకారం చుట్టారని, అతి త్వరలో అమలు చేస్తామ‌ని తెలిపారు.

గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయటమే తన జీవిత కోరిక

మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దీవెనలతో అశ్వరావుపేట పట్టణంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశార‌న్నారు. కళాశాలలో ఇప్పటివరకు దాదాపు 2500 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై ఉద్యోగాలు సాధించారని తెలిపారు. తన జీవిత కోరిక గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయటమేనన్నారు. గత ప్రభుత్వంలో కాలువలకు నిధులు కేటాయించలేదని, తమ ప్రభుత్వం కాలువల అభివృద్ధికి నిధులు కేటాయించింది అని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలలో సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులు ఆర్థికంగా బలపడాలంటే ఆయిల్ పాం సాగు చేయాలని తెలిపారు.

ఆయిల్ పాం రైతుకు ప్రభుత్వపరంగా సహకారం

రాష్ట్ర ఆయిల్‌ ‌ఫెడ్‌ ‌చైర్మన్‌ ‌జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో ఆయిల్ పాం సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని, నూతనంగా పామాయిల్‌ ‌ఫ్యాక్టరీలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం అనేక సంక్షమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు. గిరిజన రైతులు సైతం ఆయిల్ పాం పంట సాగు చేసి ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులకు నీటిపారుల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి గతంలో నిధులు ఇచ్చారని, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , హార్టికల్చర్‌ ‌డైరెక్టర్‌ ‌యాస్మిన్‌ ‌బాషా, రాష్ట్ర పామాయిల్‌ ‌సంఘం అధ్యక్షడు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, ‌రైతు సంఘం నాయకుడు బండి భాస్కర్‌, ‌ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ ‌కేవీ సత్యనారాయణ, రైతులు బండి పుల్లారావు, సత్యనారాయణ చౌదరి, చెన్నకేశవరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ ‌రాజ్‌, ‌వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *