యూరియా కోసం రైతుల అగచాట్లు

– క్యూలైన్లలో తిప్పలు
– పాలమూరులో సొమ్మసిల్లిన రైతు

. రైతులు పంటను కాపాడుకునేందుకు అవసరమయ్యే ఎరువులకోసం పడిగాపులు కాస్తున్నారు. పలు జిల్లాల్లో రైతులు నానా యాతన పడుతున్నారు.  ‌ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో అనుక్షణం ఎరువుల రాక కోసం పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా యూరియా ఎరువుల కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంపిణీ కేంద్రాల వద్ద నిద్రాహారాలు మాని క్యూలైన్లో రోజంతా నిలబడుతున్నారు. అయినా యూరియా దొరుకుతుందన్న నమ్మకం రైతులకు కలగడం లేదు. మహిళా రైతుల సైతం పనులన్నీ మానుకొని యూరియా కోసం గంటల తరబడి వేచి చూడడం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలోనే చూస్తున్నామని వాపోతున్నారు. ఇకపోతే యూరియాపై కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌నిర్లక్ష్యం రైతుల ప్రాణాల దకు తెస్తున్నది. రాత్రనక, పొద్దనక యూరియా సోకం ఆగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు. శనివారం ఉదయం మహబూబ్‌నగర్‌ ‌పట్టణంలోని పాత బస్టాండ్‌ ‌సపంలో ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్‌ ‌సంఘం వద్దకు యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ రైతుకు ఫిట్స్ ‌రావడంతో పడిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ 108 అం‌బులెన్స్‌కు సమాచారం అందించారు. స్వయంగా ఆ రైతును అంబులోకి ఎక్కించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *