సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 9: జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో తమ మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక నాయకులను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. దీనికి నిరసనగానే ఏస్కూరు – పల్లిపాడు రహదారిపై రైతన్నలు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కాగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *