– భూములు కోల్పోయే రైతుల బాధను అర్థం చేసుకున్నాం
ముత్తగూడెం వద్ద హైవే పనులు ఎంట్రీ-ఎగ్జిట్ ప్రాంతంలో పరిశీలన
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– ముత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పరిశీలన
పెనుబల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోయే రైతుల బాధను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. వారి భూ హక్కులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద హైవే పనులను ఎంట్రీ-ఎగ్జిట్ ప్రాంతంలో మంత్రి శ్రీనివాస రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే ఇచ్చిన ధరకు అదనంగా 12 శాతం నష్టపరిహారం రైతుల డిమాండ్ ప్రకారం చెల్లించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు.
మిగిలిన భూములకూ నష్టపరిహారం
హైవే నిర్మాణంలో ముక్కలుగా మిగిలిన రైతు భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి సూచించారు. రైతుల సాగు ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా సర్వీస్ రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. అలాగే అవసరమైన మేర డ్రెయిన్‌లను కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే: రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





