Farmers interests: మాకు మా రైతు ప్రయోజనాలే ముఖ్యం

– వారికి నష్టాన్ని కలిగించే విషయంలో రాజీపడబోం
– ట్రంప్‌ ‌సుంకాలపై ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరిక
– స్వామినాథన్‌ ‌శతజయంతి ఉత్సవాల్లో ప్రసంగం

న్యూదిల్లీ, ఆగస్ట్ 7: ‌భారత్‌ ‌తన అవసరాలు, ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడబోదని )(no compromise) ప్రధాని మోదీ(Prime Minister Modi)  స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకో లొంగి నడుచుకునేందుకు సిద్దంగా లేదన్నారు. రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై సుంకాలను రెట్టింపు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌. ఇప్పటివరకు ఉన్న 25శాతం సుంకాలను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదంటూ అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ ‌స్వామినాథన్‌ ‌(swaminadhan) జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్యం, టారిఫ్‌ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోం. అలా చేయడం వల్ల మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాకు తెలుసు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా నేను సిద్ధమే. భారత్‌ ‌సిద్ధమే అని మోదీ వ్యాఖ్యానించారు. ఎం.ఎస్‌.‌స్వామినాథన్‌ ‌గౌరవార్థం స్మారక నాణెం, స్టాంపును కూడా విడుదల చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు సహా భారతీయ వస్తువులపై సుంకాలను 50శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌పై ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌ ‌తాజాగా దాన్ని 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రకటించిన పాత 25శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక, కొత్తగా విధించిన అదనపు 25శాతంసుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్‌ ‌ప్రకటించారు. ఈ టారిఫ్‌లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడింది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా చాలాకాలంగా డిమాండ్‌ ‌చేస్తోంది. అందుకు ఆమోదిస్తే.. దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశం అయినందున.. వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపునకు భారత్‌ ‌ససేమిరా అంది. గతంలోనూ ఈ విషయంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అగ్రరాజ్యం ఆగ్రహించినట్లు తెలుస్తోంది. మరోవైపు, రష్యా నుంచి న్యూదిల్లీ చమురు కొనుగోలును కూడా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌పై సుంకాలను రెట్టింపు చేసింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. తన మాట వినటం లేదన్న కోపంతో ఇండియాపై ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించారు. రష్యాతో చమురు ఒప్పందాలు క్యాన్సిల్‌ ‌చేసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ భారత్‌ ‌మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ‌ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ టారిఫ్‌ల విషయంలో ఓ క్లారిటీ- ఇచ్చారు. ట్రంప్‌ ‌మతిపోయేలా సమాధానం ఇచ్చారు. మేము వెనక్కు తగ్గే అవకాశమే లేదు. మాకు రైతుల సంక్షేమమే ముఖ్యం. అదే మా ప్రధాన లక్ష్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల విషయంలో భారత్‌ ఎప్పు‌డూ వెనక్కు తగ్గదు. మాకు తెలుసు. దీని కారణంగా చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని. దానికి కూడా మేము సిద్దమే. భారత్‌ ‌కూడా సిద్దమే అని మోదీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *