ప‌రిగిలో యూరియా కోసం రైతుల ఆందోళన

– బీఆర్ఎస్ నేతల మ‌ద్ద‌తు

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:  సకాలంలో యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టిన సంఘటన పరిగి పట్టణంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. పంట అదును కాలంలో యూరియా అందకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి ఫర్టిలైజర్ దుకాణాల ముందు లైన్లో వేచి ఉన్న యూరియా దొరకటం లేదంటూ రైతులు మండిపడ్డారు. వ్యాపారులు అధికారులు కుమ్మక్కై కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ యూరియా వచ్చిన కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపించారు. యూరియా అవసరమున్న మేరకు అందించకుండా ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బ్యాగును మాత్రమే అందిస్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టడంతో బిఆర్ఎస్ నేతలు మద్దతు పలికారు. రైతులతో కలిసి పనికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ధర్నాలో పాల్గొనడంతో పరిగి పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా పోలీసులకు రైతులకు మధ్య కొంత సేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మ‌హేష్‌రెడ్డి మాట్లాడుతూ  గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేసిందని, కానీ నేడురైతులకు సకాలంలో ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు.  రైతులకు సరిపడా యూరియా తెప్పించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *