రేపు రాష్ట్రవ్యాప్తంగా ఫార్మర్ కిట్స్ పంపిణీ

– 61,125మంది రైతులకు లబ్ధి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ఫార్మర్ కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో ఈ పంపిణీ జరుగుతుంది. ప్రతి క్లస్టర్‌కు 125మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, గుర్తింపు కోసం ఈ కిట్‌లో క్లాత్ బ్యాగ్, క్షేత్ర దర్శిని డైరీ, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను, ప్యాకెట్ డైరీ వంటివి ఉంటాయి. సచివాలయంలో మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఈ కిట్లను పంపిణీ చేస్తారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *