-ఫేక్ న్యూస్‌పై మండిపడ్డ హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: పోలీసులపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్ పూర్తిగా అబద్ధమని, అది ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా ఉందని మండిపడ్డారు. ఒక వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తుంటే పోలీసులు వాటి గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ చూసుకునే ఈ ఫేక్ న్యూస్ ముఠాలు ఇలా రెచ్చిపోతున్నాయన్నారు. ఈ ఫేక్ వార్తలకు కారణమైన వారిని వెంటనే గుర్తించి డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించే ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారం మంచిది కాదని హరీష్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



