– వారి కుటుంబాలు ఎంతగా బాధపడతాయో తెలియదా
– కొడుకు చనిపోవడంతోనే నేను సగం చచ్చిపోయా
– విూడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి అసహనం
హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 10: కొందరు మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కుటుంబాలను ఇబ్బందిపెట్టేలా రాతలు రాయొద్దని హితవు పలికారు. మహిళా ఐఏఎస్‌పైనా దుష్పచ్రారం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా అధికారులపై చెప్పలేని భాషలో కొన్ని ఛానల్స్, సోషల్ విూడియాలో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మహిళా అధికారులను బదిలీ చేసే అధికారం సీఎంకే ఉంటుందని.. జిల్లా మంత్రులకు చెప్పి ముఖ్యమంత్రి బదిలీ చేయరని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతారని.. అలాంటి వారిపై అభాండాలు వేయొద్దని హితవుపలికారు. మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ‘రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సహజమని, వాటిని తాము తట్టుకుంటామని.. కానీ ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. ’మా విూద వేస్తే మేము, మా కుటుంబసభ్యులు, బంధువులు బాధపడతారు. రాసినవారు మేము చేసినట్లు చూశారా’ అని ప్రశ్నించారు. ‘దేవుడు అంటే నాకు నమ్మకం.. నేను తెలిసి ఏ తప్పూ చేయను.. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయా.. ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు.. నన్ను అవమానించి ఏం సాధిస్తారు… నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు’ అని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తప్పుడు వార్తల విూద విచారణ జరిపించాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు.
టికెట్ల రేట్ల పెంపుపై ఎవరూ కలవలేదు
సినిమా టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కొమటిరెడ్డి స్పందిస్తూ సినిమా ఇండస్టీ గురించి పట్టించుకోవడం మానేసినట్లు తెలిపారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై తన దగ్గరకు రావద్దని చెప్పానని.. దీంతో ఎవరూ తనను కలవడానికి రావడం లేదని చెప్పారు. పుష్ప సినిమా సందర్భంగా ఓ మహిళ చనిపోవడం బాధాకరమన్నారు. అప్పటి నుంచే టికెట్ల రేట్ల పెంపు కోసం తన దగ్గరకు రావొద్దని చెప్పానని అన్నారు. నిన్నటి సినిమాకు టికెట్ల ధరల పెంపు, రేపటి సినిమాకూ టికెట్ రేట్లు పెంచిన విషయం తనకు తెలీదని చెప్పారు. టికెట్ల రేట్ల పెంపుపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





