గచ్చిబౌలిలో నకిలీ విదేశీ మద్యం గుట్టు రట్టు

– ఐదుగురి అరెస్ట్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జనవరి 7 : నకిలీ విదేశీ మద్యం తయారీ, రవాణా చేస్తున్న ముఠాను జిల్లా టాస్క్ ఫోర్స్ శంషాబాద్ పోలీసులు గచ్చిబౌలి పరిధిలో పట్టుకున్నారు. విశ్వ‌స‌నీయ‌మైన‌ సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని ఇందిరానగర్ – లింగంపల్లి రోడ్డుపై రూట్ వాచ్ నిర్వహించిన పోలీసులు, స్కూటీపై తరలిస్తున్న 15 గ్లెన్‌లివెట్ నకిలీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దేశిని ప్రకాష్ గౌడ్ (29), మరో వ్యక్తిని అరెస్టు చేశారు.అనంతరం ప్రకాష్ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు కేపీహెచ్‌బీలోని అతని అద్దె ఇంటిని తనిఖీ చేయగా గ్లెన్‌ఫిడిచ్, చివాస్, డివార్స్, బ్లూ లేబుల్, విలియం లాసన్ తదితర బ్రాండ్లకు చెందిన 46 నకిలీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఈ వ్యవహారంలో సహకరిస్తున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి కొండాపూర్‌లోని మృత్యుంజయ మహంతి నివాసాన్ని సోదా చేయగా తక్కువ ధర మద్యాన్ని ఖరీదైన బ్రాండ్ సీసాల్లో నింపి సీలు వేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అతని వద్ద నుంచి 54 నకిలీ మద్యం సీసాలు, 136 ఖాళీ సీసాలు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. మరోచోట మధాపూర్‌లో 24 నకిలీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఈ దాడుల్లో మొత్తం 139 నకిలీ మద్యం సీసాలు, 136 ఖాళీ సీసాలు, మూడు స్కూటీలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్టు చేశారు. డీసీపీ దశరథ్ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్, శంషాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.
——————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *