– ఘనంగా మండమెలిగె పండగ నిర్వహణ
– భారీగా తరలి వస్తున్న భక్త జనం
– గద్దెల వద్ద పూజారుల ప్రత్యేక పూజలు
ములుగు, ప్రజాతంత్ర, జనవరి21: మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల మండ మెలిగే పండుగను పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయాన్నే మేడారం సమ్మక్క దేవత పూజరులు సిద్ధబో యిన, కొక్కెర, మ్లలెల, వంశీయులు, నె రాలమ్మ పూజారులు కాక వంశీయులు వారి వారి ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. అనంతరం పిల్లాపాపలతో సహా పవిత్ర స్నానాలు చేశారు. సమ్మక్క పూజారులు మేడారం గుడికి సారల మ్మపూజారులు కన్నెపెళ్లి గుడికి వెళ్లి గుడులను పవిత్ర గోదావరి జలంతో శుద్ధి చేశారు. అనంతరం సమ్మక్క పూజారి ఆయన సిద్ధబోయిన నితిన్, సారలమ్మ పూజారి అయిన కాక సారయ్య ఇండ్ల వద్ద డోలు వాయిద్యాల నడుమ మామి డాకు తోరణాలను కట్టారు. అక్కడినుం డి పూజారులు ఆడపడుచులు (ఆడబిడ్డలు) పూజా సామగ్రితో మంగళ హారతులతో ఆయా గుడులకు చేరుకున్నారు. ఆడబిడ్డలు అడవి నుంచి తెచ్చిన పుట్ట మన్నుతో గుడులను అలికి ముగ్గులు వేశారు. అనంతరం పూజారులు డోలు వాయిద్యాల నడుమ బొడ్రాయి, ముత్యా లమ్మ, భూలక్ష్మి, మహాలక్ష్మి లకు నూతన వస్త్రాలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అక్కడ నుంచి నేరుగా ఆలయం ముందు బురికా స్తంభాలతో తోరణా నికి చీడపీడలు రాకుండా కోడిపిల్ల, సొరకాయ, మిరపకాయ, మామిడి, వేప మండలు కట్టి తోరణం కట్టారు. అనంతరం గ్రామ పొలిమేరలల్లో బూరిక చెట్లతో తోరణాలు కట్టారు. సాయంత్రం డోలు వాయిద్యాల నడుమ గద్దెల వద్దకు చేరుకొని రహస్య పూజలు చేశారు. దీంతో మహాజాతరకు అంతా సిద్ధమని పూజారులు తెలిపారు. ఇదిలావుంటే గత వారం రోజులుగా భక్తుల పెద్ద ఎత్తున పోటెత్తారు. భారీగా తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





