– సిట్ పేరుతో చిల్లర రాజకీయాలు
– రేవంత్ దివాలాకోరు రాజకీయం
– తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే
– బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే నన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే. పరిపాలన చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేం దుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందన్నారు. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు విచారణల పేరుతో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అన్నారు
ఇది ప్రతీకారం తప్ప మరోటి కాదు : ఎక్స్ వేదికగా కెటిఆర్
విచారణల పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ఈ కక్షసాధింపు రాజకీయాలను బీఆరఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ’చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్. అడ్డగోలు హావిÖలు ఇచ్చి, అబద్దాల పునాదుల విÖద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హావిÖల అమలులో పూర్తిగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల ద ష్టిని మళ్లించేందుకు, ఇప్ప్పుడు విచారణల పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం’ అని కేటీఆర్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారని కేటీఆర్ అన్నారు.
—————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





