15 నుండి కేయూలో ముఖ గుర్తింపు హాజరు

– కాళోజి జంక్షన్/హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వివిధ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరును పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఈ నెల 15 నుండి కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ముఖ గుర్తింపు హాజరు అమల్లోకి తీసుకురానున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి సమక్షంలో ఈ కొత్త హాజరు విధానాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతగా క్యాంపస్ కాలేజీ, దూర విద్యా కేంద్రం, ఫార్మసీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ (కో-ఎడ్యుకేషన్), పరీక్షల విభాగం, హాస్టల్ కార్యాలయాలలో కూడా ఈ ముఖ గుర్తింపు హాజరు వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. సంబంధిత విభాగాల ఉద్యోగులు నూతన హాజరు విధానాన్ని గమనించి అనుసరించాల్సిందిగా సూచించారు.  విశ్వవిద్యాలయంలో సమయ పాలన పాటించని ఉద్యోగులు, గైర్హాజరు విద్యార్థులు తదితరులను కట్టడి చేయడానికి బాగా ఉపయోగపడుతుందని విశ్వవిద్యాలయం అధికారులు భావిస్తున్నారు.
———————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *