హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యల ప్రమాద బీమా పథకాన్ని 2029వరకు పొడిగిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ జీవో జారీ చేశారు. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అమల్లోకి వచ్చిన ఈ ప్రమాద బీమా వల్ల ప్రమాదవశాత్తు మరణించిన ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.10 లక్షల బీమా కష్టకాలంలో వారి టుంబాలకు భరోసాగా ఉంటుందన్నారు. ఇప్పటికి 409 మందికి ప్రమాద బీమా మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రమాద బీమా ఇస్తున్న ధీమాతో ఈ గ్రూపుల్లో ఇప్పటివరకు 1.67 లక్షల మంది కొత్త సభ్యులు చేరారన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాద బీమాను మరో నాలుగేళ్లపాటు పొడిగిస్తూ శ్రీధర్ జీవో జారీ చేశారు.
ఎస్‌హెచ్‌జీ సభ్యుల ప్రమాద బీమా పొడిగింపు





