బీఆర్‌ఎస్‌, బీజీపీల పొత్తును బ‌య‌ట‌పెట్టండి

– పథకాల అమలుపై ఇంటింటా ప్రచారం చేయాలి
– ములుగు నాయకులు, కార్యకర్తలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం
– నవీన్‌ ప్రచారానికి వచ్చి మంత్రితో మాటామంతీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: పజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చాలని, అదే సమయంలో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య ఉన్న రహస్య పొత్తును ప్రజలకు బహిర్గతం చేయాలని ములుగునుంచి వచ్చిన నాయకులు, కారకర్తలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం కోసం ములుగు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ నేతృత్వంలో వారు మంత్రి సీతక్కను ప్రజా భవన్‌లో కలిసి సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం చేపట్టాల్సిన వ్యూహాలపై మంత్రి సీతక్క పలు సూచనలు చేశారు. నవీన్‌ యాదవ్‌ విజయం ఖాయమే అయినప్పటికీ, అతి విశ్వాసం వద్దని, ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సమగ్రంగా ప్రచారం కొనసాగించాలని ఆమె సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *