10వేల కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం

– రాజస్థాన్‌లో దాడులు చేసి పట్టుకున్న అధికారులు

జయపుర, జనవరి 26: రిపబ్లిక్‌ ‌డే వేళ ఇంటెలిజెన్స్ అధికారులు స్మగ్లింగ్‌ ‌నెట్‌వర్క్‌ను ఛేదించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు రాజస్థాన్‌లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నాగౌర్‌ ‌జిల్లాలోని ఓ ఫామ్‌హౌస్‌లో స్మగ్లింగ్‌ ‌నెట్‌వర్క్ ‌పని చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఫామ్‌హౌస్‌పై దాడి చేయగా.. 187 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు డిటోనేటర్లు, డిటోనేటర్‌ ‌వైర్లు, ఇతర పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. వీటిని అక్రమ మైనింగ్‌లో వాడుతున్నట్లు అనుమానం వ్యక్తంచేశారు. సులేమాన్‌ఖాన్‌ అనే వ్యక్తి అరెస్ట్ ‌చేసి, విచారణ చేపట్టామన్నారు. ప్పటివరకు ఈ పేలుడు పదార్థాలను ఎవరెవరికి సరఫరా చేశారు. ఇందులో ఇతర రాష్ట్రాల ముఠాలకు కూడా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అక్రమ మైనింగ్‌ ‌కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు నిందితుడు ఈ పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందన్నారు. నిందితుడిపై గతంలోనూ పేలుడు పదార్థాల సరఫరాకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *