– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న ఎన్‌హెచ్-167 రహదారిని నాలుగు లేన్లకు విస్తరించడానికి ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ’ఎక్స‘లో తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు, నిత్యం ట్రాఫిక్ రద్దీతో సతమతమవుతున్న నారాయణపేట్, మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు ఉపశమనం లభించనున్నదన్నారు.
80.01 కిలోమీటర్ల పొడవుతో రూ.3,175.08 కోట్లు (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద) పెట్టుబడితో ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడమేగాక సరకు రవాణా సామర్థ్యం పెరుగుతుందన్నారు. నారాయణపేటI మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య రవాణా మెరుగుపడుతుంది. ఎన్‌హెచ్-150, ఎన్‌హెచ్ 167తో అనుసంధానం ద్వారా ప్రాంతీయ ఆర్థికవృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు ప్రధాని మోదీ మద్దతిస్తున్నారని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున ప్రధానికి కిషన్‌రెడ్డి కతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




