– మంత్రి శ్రీధర్‌బాబు
ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రజలకు వేగవంతమైన, అత్యవసర వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 108 అత్యవసర సేవలను విస్తరిస్తున్నదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మచ్చుపేటలో ఆయన అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు, అకస్మాత్తు అనారోగ్యాలు, గర్భిణీ ల అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆధునిక సాంకేతికతతో కూడిన అంబులెన్సులు,శిక్షణ పొందిన వైద్య సిబ్బందితో 108 సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు. 108 సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో సురేష్,తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి,డిఎంహెచ్వో ప్రమోద్ కుమార్, ముత్తారం ప్రభుత్వ వైద్యాధికారి అమరేందర్రావు,సంబంధిత శాఖాధికారులు,వైద్య సిబ్బంది,ప్రజాప్రతినిధులు మాజీ జెడ్పిటిసి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ,మాజీ జెడ్పిటిసి సభ్యుడు నాగినేని జగన్ మోహన్ రావు,మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య,డైరెక్టర్లు బుచ్చంరావు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినీత్,సర్పంచ్ లు చిలువెరి జ్యోతి లక్ష్మణ్,బియ్యని శివకుమార్,బొంతల అన్నపూర్ణ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




