– ఆందోళన వాయిదా వేసుకున్న ఉద్యోగులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 02: సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు చర్చించారు. ఈనెల 8న విధివిధానాలు ఖరారు చేసి, త్వరలో హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ హా ఇచ్చింది. టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రివర్గ ఉప సంఘం తెలిపింది. పెండింగ్ బిల్లుల విడుదల, నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు హా లభించింది. విజిలెన్స్, ఏసీబీ కేసులతో రెండేళ్లకు పైగా సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈనెల 8 నుంచి 19 వరకు చేపట్టనున్న జిల్లా బస్సు యాత్ర, 12న ఛలో హైదరాబాద్ వాయిదా వేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల ఐకాస తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





