ఉత్సాహంగా కైట్‌ ఫెస్టివల్‌

చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు

సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులు.. ఆ తర్వాత పతంగులు. సంక్రాంతి సందర్భంగా యువత ఎంతో ఉత్సాహంగా కైట్స్‌ ఎగురవేస్తుంటారు. మహిళలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులతో పండుగను జరుపుకోగా.. మగవారు పతంగులు ఎగురవేస్తూ ఆడి పాడి ఎంజాయ్‌ చేస్తుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తుంటారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు చోట్ల కైట్స్‌ ఫెస్టివల్స్‌ను  నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకుని ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలిపటాలను ఎగురవేస్తారు.

అలాగే కైట్స్‌ ఫెస్టివల్‌ను డీజే మోతతో హోరెత్తిస్తుంటారు. మరోవైపు హైదరాబాద్‌లో పతంగుల సందడి మొదలైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కైట్స్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. డీజే హోరు మధ్య భవనాలపై పతంగులు ఎగురుస్తున్నారు. బోయినపల్లిలో ఏర్పాటు చేసిన కైట్‌ ఫెస్టివల్‌లో చిన్నారులతో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి పతంగులు ఎగుర‌వేశారు. మరోవైపు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్ జరిగింది. అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటకభాషా సాంసృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నగరంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో కైట్‌ ఫెస్టివల్‌ ప్రారంభమవగా.. దాదాపు 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్‌ ప్రొఫెషనల్‌ కైట్‌ ఫ్లైయర్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు.

అలాగే14 రాష్ట్రాల నుంచి కైట్‌ ఫెస్టివల్‌లో  54 మంది నేషనల్‌ ప్రొఫెషనల్‌ కైట్‌ ఫ్లైయర్స్‌ పాల్గొంటారు. పతంగుల పండుగకు  ఇండోనేషియాస్విట్జర్లాండ్‌ఆస్ట్రేలియాశ్రీలంకకెనడాకంబోడియాస్కాట్లాండ్‌థాయిలాండ్‌కొరియాఫిలిప్పీన్స్‌వియత్నాంమలేషియాఇటలీతైవాన్‌సౌత్‌ ఆఫ్రికానెదర్లాండ్స్‌తదితర దేశాలకు చెందిన 50 మంది కైట్‌ ఫ్లైయర్స్‌ హాజరుకానున్నారు. అలాగే గుజరాత్‌పంజాబ్‌తమిళనాడుకేరళహరియాణాఆంధ్రప్రదేశ్‌తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 60 మంది క్రీడాకారులు తరలిరానున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కైట్‌ ఫెస్టివల్‌ జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *