సాహితీ లోకంలో హర్షాతిరేకాలు

– అవార్డు అందుకున్నవేళ సిధారెడ్డికి అభినందనల వెల్లువ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మ న్స్ డాక్టర్ నందిని సిధారెడ్డికి ఇటీవల ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయడంతో తెలుగు సాహితీ లోకంలో ఉత్సాహం నెలకొంది. 2025 సంవత్సరానికి గాను ఆయన రచించిన ‘అనిమేష’ కవితా సంకల నానికి దక్కిన ఈ గౌరవం తెలంగాణ అస్తిత్వ కవిత్వానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా సిధారెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తామ్ర పత్రం, లక్ష రూపాయల నగదు పురస్కారంతోపాటు అకాడమీ అందజేసిన ప్రశంసాప త్రం ‘అనిమేష’ విశిష్టతను చాటిచెప్పింది. అవార్డు ప్రదానోత్సవం అనంతరం సాహిత్య వర్గాల్లో ‘అనిమేష’ కవితా సంకల్పనంపై ఆస క్తికర చర్చ మొదలైంది. కొరోనా విపత్తు కాలంలో మనిషి అనుభవించిన నిశ్శబ్ద వేద నను, ప్రకృతి మనిషి మధ్య సాగిన తాత్విక సంభాషణను సిధారెడ్డి అద్భుతంగా ఆవిష్క రించారని సాహితీవేత్తలు కొనియాడారు. కేవలం విపత్తును వివరించడమే కాక ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక గొప్ప నివాళిగా ఈ రచన నిలుస్తుందని అకాడమీ ప్రశంసించడం విశేషం. ఇప్పటికే దాశరథి వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న సిధారెడ్డి ఖాతాలో కేంద్ర సాహిత్య పురస్కారం చేరడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు పలువురు ప్రముఖ కవులు అభినందనలు తెలుపుతున్నారు. 20కి పైగా పుస్తకా లు రాసి, తెలంగాణ ఉద్యమ సాహిత్యంలో చె రగని ముద్ర వేసిన సిధారెడ్డికి ఈ పురస్కారం దక్కడం సముచితమని వారు పేర్కొన్నారు. నందిని సిధారెడ్డికి ఇక్కడ ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించేందుకు సాహిత్య సంస్థలు సిద్ధమవుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *