– ఫామ్ హౌస్‌లు కట్టుకుని పార్టీకి చెడ్డ పేరు
– మాజీ మంత్రిపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్
హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబరు 24: బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన అవినీతికి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బపడిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన మూడు నాలుగు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని.. చెప్ప లేనంత అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మార్వో ఆఫీస్ను కాల్చేస్తే కూడా ప్రజలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని.. ఎదురు తిరిగిన 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారంటూ మాజీ మంత్రిపై ఫైర్ అయ్యారు. ఇలాంటి అవినీతిపరుడిని చిత్తుగా ఓడించడం సరైన నిర్ణయమన్నారు. వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి రాచరిక పాలనను తలపించారని విమర్శించారు. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని నిరంజన్ రెడ్డి తనకు తాను నీళ్ల నిరంజనుడుగా పేరు మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘నా గురించి ఇంకొక్కసారి ఎక్కడైనా మాట్లాడితే నీ తాట తీస్తా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో’ అంటూ నిరంజన్ రెడ్డికి కవిత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





