డ్యామ్‌ ల నుంచి భూముల వరకూ అన్నీవిధ్వంసమే.!

” వాస్తవానికి పెరుగుతున్న విద్యార్థుల అవసరాల దృస్టి యూనివర్సిటీలకు ఇంకా ప్రభుత్వం భూములు ఇవ్వాలి..వర్సిటీలకు ఎంత ఎక్కువ భూములు ఉంటే అంత మంచింది.విద్యార్థుల విద్యాప్రమాణాలు పెరుగుతాయి.వారు రీసెర్చులు చేసేందుకు అవసరమైన మొక్కలు, ప్రకృతి వనాలు అందుబాటులో ఉంటాయి. వర్సిటీ ఎంత విశాలంగా ఉంటే విద్యార్థుల ఆలోచనలు అంత విశాలంగా ఉంటాయి.ఇరుకు గదుల్లో, సందుల్లాంటి వర్సిటీలుంటే విద్యార్థుల నైపుణ్యం పెరగదు..వారిలో స్కిల్స్‌అభివృద్ది కావు. విద్యార్థులు ప్రకృతితో మమేకం అయినప్పుడే వాళ్ల ఆలోచనలు చురుగ్గా ఉంటాయి..వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అద్బుతమైన ఆవిష్కరణలు చేయగలుగుతారు..” 
తెలంగాణలో రెండేళ్లుగా భూముల అమ్మకం, డ్యామ్‌ల కూల్చడం …  ఇళ్లు కూల్చడం చెక్‌ డ్యామ్‌లు పేల్చడం ప్రాజెక్ట్‌లను పడావు పెట్టడం ఒక యుద్దంలా సాగుతోంది.మార్పు పాలనల ముసుగులో విధ్వంస పాలన నడుస్తోంది. ఇసుక మాఫియా, భూ మాఫియా మూడు పువ్వులు ఆరుకాయలన్నట్లు ప్రజా పాలన నడుస్తోంది.
పేదల భూములు గుంజుకోవడం నుంచి యూనివర్సిటీల భూములు అమ్ముకోడం వరకూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూ మాఫియా, ఇసుక మాఫియా, ఆర్ధిక మాఫియా, ప్రకృతి వనరుల దోపిడి మాఫియా రెచ్చిపోయతుంది.గల్లీ నుంచి దిల్లీ నేతల వరకూ అందరూ రాష్ట్ర సంపద దోచుకునే ఎజెండాతో ఉన్నారు.కాదేది దోపిడికి అనర్హం అన్నట్లు దేన్ని అధికార పార్టీ నేతలు వదలడం లేదు. ప్రకృతి విధ్వంసంతో పాటు పర్సెంటేజీలతో ఆర్థిక ప్రకృతి విధ్వంసానికి తెగబడుతున్నారు.
హైడ్రాతో పేదల ఇళ్లు కూల్చుతూ హైదరాబాద్‌ భూములను పాలకులు చెరబట్టుతుంటే, మరోవైపు వర్సిటీ భూములను లాక్కుంటూ ప్రభుత్వమే అధికారికంగా రాష్ట్రంలో భూ మాఫియాకు తెర తీసింది. పాలకుడే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయితే రాష్ట్రంలో ప్రజలు, ప్రభుత్వ భూములు అమ్మడమే అతని ఏకైకా ఎజెండా అవుతుంది. అమ్మడం కొనడమే పాలకుడి విధానమైతుంది. ప్రజల బతుకులు ఫ్లాట్స్‌, విల్లాలుగా మార్చి అమ్ముతున్నాడు.
.ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఒక పాలసిగా తీసుకుంది. పథకాలు అమలు చేయడం లేదు కానీ, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టేందుకు మాత్రం భూ మాఫియా పాలసిని కాంగ్రెస్‌ పగడ్బంధిగా అమలు చేస్తుంది. హైడ్రాతో పేదల ఇళ్లు కూల్చుతు ఆ భూమిని క్రమంగా అమ్ముకోవడమో, తన బంధవులకు ధారాదత్తం చేయడమో చేస్తుంది. ఒక వైపు వరదలు,నాలాల కబ్జాలంటూ తెలంగాణ ప్రజలను నమ్మించి హైడ్రాతో హైదరాబాద్ భూములు చెరబట్టుతూనే మరోవైపు యూనివర్సిటీల భూములపై కన్నేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని అమ్మడంపై ఫోకస్‌ పెట్టింది.సంపద సృష్టించడం, దాన్ని ప్రజలకు పంచడం కోసం పాలసీలు కాకుండా ప్రభుత్వ భూములు, వర్సిటీ  భూములను అమ్మకంపై పాలసీలు చేస్తుంది. నియంత పాలన, నియంతృత్వ విధానాలు, విధ్వంసకర ఆలోచనలతో రాష్ట్రం పూర్తిగా దివాలా  తీసింది.
ఆదాయం తగ్గింది, రాబడి పోయింది. వెల్త్ క్రియేటివ్‌ నిర్ణయాలు కాకుండా విధ్వంసం చేసే నిర్ణయాలు తీసుకోవడంతో రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో ప్రభుత్వాన్ని నడపడానికి కాంగ్రెస్‌కు భూముల అమ్మకం ఆదాయం తప్ప మరో రాబడి ఆర్థిక వనరులు లేదు. గతంలో ప్రభుత్వాలు భూములు అమ్మకుంటూ పోతే చనిపోయిన తర్వాత సమాధి చేసేందుకు ప్రజలకు భూమి కూడా మిగలదని గప్పాలు కొట్టిని రేవంత్‌ రెడ్డి, ఇవాళా రాష్ట్రంలో ఉన్న బరియల్ గ్రౌండ్స్‌ను కూడా అమ్మకానికి పెట్టారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను అధికారంలోకి వచ్చిరాగానే అడ్డికిపావుసేర్‌ గా అమ్మడం మొదలు పెట్టారు.
వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని యూనిర్సిటీల్లో భూములపై ఫోకస్‌ పెట్టింది.వర్సిటీ నుంచి భూములను లాక్కునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆయా వర్సిటీలో ఫ్యాకల్టీ, టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌, ల్యాబ్స్‌, మౌళిక సదుపాయాలు, విద్యార్థుల సమస్యలు, రీసెర్చ్‌ల పెంపుపై ప్రభుత్వం సృష్టిపెట్టలేదు కానీ, ఆయా వర్సిటీల భూములను ఎలా చెరబట్టాలి.ఎక్కడ కబ్జాలు పెట్టాలనే దానిపైనే నేతలు ఫోకస్‌ పెట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిరాగానే నగరంలో పేదల భూమలపై పడ్డది.
హైదరాబాద్‌ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను కాంగ్రెస్‌ నేతలు చెరబట్టారు.ఆ తర్వాత ఏకంగా హైదరాబాద్‌ సెంట్రల్ వర్సిటీ భూములనే ప్రభుత్వం కబ్జా పెట్టి తన అమ్మకానికి పెట్టింది.రాత్రికి రాత్రే హెచ్‌సీయూ భూముల్లోకి వందల బల్డోజర్లు పంపింది. అడవులు, చెరువులు కుటుంలను పూడ్చేసి వందల ఏకరాల్లో చెట్టలను నరికేసి ప్రకృతి విధ్వంసానికి, పర్యావరణ వినాశం చేసింది. విలువైన, రేర్‌ మొక్కలను, ఆయుర్వేదిక మూలాలున్న మొక్కలను ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఏకంగా ప్రైవేట్‌ బ్యాంక్‌లో కుదవపెట్టి వేల కోట్ల అప్పు ప్రభుత్వం తీసుకువచ్చింది. విద్యార్థుల పోరాటం, సుప్రీంకోర్ట్‌ జోక్యంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అడవులను పునరుద్దించకపోతే సీఎస్‌ను జైల్లో వేస్తామని  వార్నింగ్ ఇచ్చింది.
.హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల అమ్మకంలో ప్రభుత్వం కుట్రలు విద్యార్థులు భగ్నం చేయడం, భూమి అమ్మి తన మిత్రులకు కట్టబెట్టాలన్న ఆలోచనలు న్యాయ స్థానం జోక్యంతో బూమరాంగ్ కావడంతో ఇప్పుడు మరో జాతీయ వర్సిటీ భూములపై రేవంత్‌ రెడ్డి కన్నుపడింది.హెచ్‌సీయూకు పక్కనే ఉన్న ఉర్దూ వర్సిటీ భూములను అమ్మేందుకు ప్రభుత్వం కుట్రలు మొదలు పెట్టింది..విషయం బయటకు పొక్కుకుండా జాగ్రత్తగా అమ్మకం ఎజెండాను అమలు చేస్తుంది.ఉర్దూ వర్సిటీకి కావాలిసిన దానికంటే అధనంగా భూమి ఉందని అది పనికి రాకుండా ఉందని వర్సిటీకి చెందిన 50 ఏకరాల భూమి అమ్మేందుకు వర్సిటీ అధికారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
సీఎం రేవంత్‌ రెడ్డి ఏ వర్సిటీకి ఊరికే వెళ్లరు.తన పర్యటన వెనుక వర్సిటీ భూముల అమ్మకమే ఎజెండా ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా రేవంత్‌ రెడ్డి విద్యార్ధులతో ఫుట్‌బాల్ ఆడారు.వెంటనే వర్సిటికి చెందిన 400 ఏకరాలను అమ్మకానికి పెట్టారు. గత ఏడాది చివరిలో సీఎం ఓయూలో పర్యటించారు. అయితే ఆ పర్యటన వేనుక కూడా ఓయూ భూముల అమ్మకమనే హిడెన్‌ ఎజెండా ఉన్నందా అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
.ఓయూ పర్యటన సందర్భంగా వెయ్యి కోట్ల జీవో అయితే ఇచ్చారు గానీ, వర్సిటీ భూముల రక్షణ, సర్వే, పెన్సింగ్‌వంటి విషయాల గురించి మాట్లాడలేదు. విద్యార్థులు, ప్రొపెసర్లు అడిగిన వర్సిటీ  భూముల పరిరక్షణపై సీఎం భరోసా ఇవ్వలేదు..అంటే దాల్‌మే కుచ్‌ కాలా అని విద్యార్థుల్లో చర్చ జరుగుతుంది.హెచ్‌సీయూ వెళ్లిన సీఎం అక్కడి భూములు అమ్మకానికి పెట్టారు. ఓయూ వచ్చిన సీఎం తమ భూములు కూడా అమ్మకానికి పెడుతారేనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో కీలక ప్రదేశంలో ఉన్న భూములను కబ్జా పెట్టేందుకు ప్రభుత్వమే కబ్జా అవతారం ఎత్తింది..ఒకవైపు రాష్ట్రంలోని వర్సిటీల భూములపై కన్నేసి అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.ఇప్పుడు ఏకంగా నగరం నడి బొడ్డున ఉన్న పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసిన ల్యాండ్ బ్యాంక్‌ భూమునుల చెరబట్టేందుకు, వాటిని అమ్ముకుని పాలన చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హిల్ట్‌ పాలసీ తీసుకువచ్చి విలువైన భూములను అగ్గువసగ్గువకు అమ్మేందుకు  హిల్ట్‌ పాలసీ ప్లాన్‌ కాంగ్రెస్‌ తీసుకువచ్చింది  కాలుష్యం పేరుతో నగర ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ పారిశ్రామిక వాడల్లోని భూములను అమ్మకానికి పెట్టే ప్రయత్నం కాంగ్రెస్‌ చేస్తుంది. పొల్యుషన్‌ పేరుతో పది వేల ఏకరాల భూమిని దోపిడి చేసే ఎజెండాతో హిల్ట్‌ పాలసీ తీసుకువచ్చింది.
. విద్యకు, యువతలో నైపుణ్యం, స్కిల్స్‌ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకుంటున్న రేవంత్‌ రెడ్డి,వర్సిటీ భూములు అమ్మకోవడం కాంగ్రెస్‌ ద్వంద విధానాలకు నిదర్శనం. వాస్తవానికి పెరుగుతున్న విద్యార్థుల అవసరాల దృస్టి యూనివర్సిటీలకు ఇంకా ప్రభుత్వం భూములు ఇవ్వాలి..వర్సిటీలకు ఎంత ఎక్కువ భూములు ఉంటే అంత మంచింది.విద్యార్థుల విద్యాప్రమాణాలు పెరుగుతాయి.వారు రీసెర్చులు చేసేందుకు అవసరమైన మొక్కలు, ప్రకృతి వనాలు అందుబాటులో ఉంటాయి. వర్సిటీ ఎంత విశాలంగా ఉంటే విద్యార్థుల ఆలోచనలు అంత విశాలంగా ఉంటాయి.ఇరుకు గదుల్లో, సందుల్లాంటి వర్సిటీలుంటే విద్యార్థుల నైపుణ్యం పెరగదు..వారిలో స్కిల్స్‌అభివృద్ది కావు. విద్యార్థులు ప్రకృతితో మమేకం అయినప్పుడే వాళ్ల ఆలోచనలు చురుగ్గా ఉంటాయి..వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అద్బుతమైన ఆవిష్కరణలు చేయగలుగుతారు.
ఒకవైపు ఫ్యూచర్‌ సిటీలో వందల ఏకరాలు ప్రైవేట్‌ వర్సిటీలకు భూములు ఇస్తూ మరోవైపు నగరంలో ఉన్న ప్రధాన వర్సిటీ భూములు అమ్మకానికి పెట్టడం కాంగ్రెస్‌ ప్రభుత్వం ద్వంద వైఖరికి నిదర్శనం. వర్సిటీలకు మరిన్ని భూములిచ్చి  రక్షించాల్సింది పోయి ఉన్నవాటిని అమ్మడం కాంగ్రెస్‌ రియల్‌ ఎస్టెట్‌ రాజకీయాలకు నిదర్శనం.ప్రభుత్వ వర్సిటీ భూములను కాపాల్సిన ప్రభుత్వమే అమ్మడం అంటే విద్యాను పేదలకు దూరం చేయడమే. కొత్త క్యాంపస్‌ కట్టి మరింత మందికి ఉన్నత విద్యాను అందించాల్సిన సర్కార్‌ వర్సిటీలకు ఉన్న భూములు అమ్మి కొత్త క్యాంపస్‌లు నిర్మించకుండా, కొత్తగా వచ్చే పేద బడుగు బలహీనవర్గాలకు వర్సిటీ విద్యాను అందకుండా చేయడమే అవుతుంది. వర్సిటీల భూములు అమ్ముకుంటూ పోతే క్యాంపస్‌లో విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయి..విద్యార్థుల్లో నూతన ఆలోచనలు ఎలా వస్తాయి.వారిలో నైపుణ్యాలు ఎలా పెరుగుతాయి..కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఒకవైపు రాష్ట్రంలో పాత వర్సిటీల భూములు అమ్ముతూ పోతూ మరోవైపు ఫ్యూచర్‌లో సిటీలో స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సటీలు ఏర్పాటు చేస్తే ఏం లాభం.
.హైదరాబాద్‌లో లంగ్స్‌ ప్పేస్‌ను లేకుండా చేస్తూ వర్సిటీ భూములను విధ్యంసం చేస్తున్నారు.గ్రామాల్లో చెక్‌ డ్యామ్‌ను పేల్చుతు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. భూ మాఫియా అయిన, ఇసుక మాఫియా అయిన ప్రభుత్వం ప్రత్యేక్షంగా, పరోక్షంగా నడిపిస్తున్న దోపిడీనే. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికే కాదు పర్యావరణ ప్రకృతి విధ్వంసానికి కూడా గురైంది. ఇది ఇందిమ్మ రాజ్యం కాదు మాఫియా రాజ్యం.
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *