ప్రతీ ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలి

మైదానం ఉంటేనే కళాశాలలకు అనుమతి ఇవ్వాలి

ప్రతి పాఠశాలలో పిఇటిలను నియమించాలి

జంగా రాఘవరెడ్డి

ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్

హ‌నుమ‌కొండ‌, ప్రజాతం్ర‌త‌, జూన్ 22ః ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తుల బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ప్రతి ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా ఒలింపిక అసోసియేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం 39వ ఒలింపిక్ డే రన్ ముగింపు కార్యక్రమం జ‌రిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాఘవ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రీడల పట్ల ఆకర్షితులయ్యేందుకు పాఠశాల దశ కీలకమని, అయితే అనేక పాఠ‌శాల‌లు, కళాశాలలకు కనీస మైదానాలు లేకపోవడం శోచనీయమన్నారు. మైదానాలున్న విద్యాసంస్థలకు మాత్రమే అనుమతిస్తూ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు తప్పనిసరిగా నియమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా రంగా న్ని నిర్లక్ష్యానికి గురిచేసిందంటూ స్వతహాగా క్రీడాకారుడైన సీఎం నేతృత్వంలో క్రీడల‌కు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ ఒలింపిక్ సృష్టికర్త క్యుబర్టీన్ అందించిన ఒలింపిక్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలోని అన్ని క్రీడా సంఘాల సహకారంతో ప్రతి ఏడాది నగరంలో ఒలింపిక్ డే రన్ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హనుమకొండ జిల్లా క్రీడలు యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో క్రీడా మౌలిక సదుపాయాలలో జిల్లా గణనీయ అభివృద్ధి సాధించినట్లు చెప్పారు.

వేసవి క్రీడా శిక్షణలో పొందిన స్ఫూర్తితో నిత్యం స్టేడియంకి వచ్చే క్రీడాకారులు, తల్లిదండ్రుల సంఖ్య పెరగడం సంతోషదాయకం అన్నారు. కాళోజీ కూడలిలో ఒలింపిక్ డే రన్ ను జంగా రాఘవరెడ్డి , అజిజ్ ఖాన్ లు జెండా ఊపి ప్రారంభించారు. కాలేజీ జంక్షన్ నుండి అంబేద్కర్ చౌరస్తా, ఏషియన్ మాల్ మీదుగా స్టేడియం వరకు దాదాపు 600 మంది రన్ కొనసాగింది.అతిథులు క్రీడా జ్యోతిని చేతబూని ఉత్సాహంగా రన్ లో భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్పొరేటర్లు, కాం్ర‌గెస్ నాయకులు బొద్ధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, ఎస్. పవన్ కుమార్,పి. రమేష్ రెడ్డి, తోట శ్యాం ప్రసాద్, మహ్మద్ కరీం, సృజన్ కాంత్, బిన్ని లక్ష్మణ్, రామప్ప స్పోర్ట్స్ అథారిటీ కోచ్ లు వ్యాయామ విద్య ఉపాధ్యాయులు,వాకర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *