– వోటుతో ప్రజలు దూరం పెట్టిన వైనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: పదవుల కోసం ఇష్టారీతిన పార్టీలు మారిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వోటర్లు గట్టిగా బుద్ధిచెప్పారు. పలు జిల్లాల్లో పార్టీ మారిన వారిని ప్రజలు తిర స్కరించారు. బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అసవరాలు తీరగానే అవతలి పార్టీలకు వెళ్లిన పలువురికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వోటర్లు షాకిచ్చారు. నల్లగొండ జిల్లా చౌటుప్పలు చెందిన వేంరెడ్డి రాజు గతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గెలిచారు. దాంతో అతడికి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. పార్టీలో మున్సిపల్ ఛైర్మన్ పదవి అనుభవించిన అతను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తన భార్య వేంరెడ్డి సంధ్యను కౌన్సిలర్గా బరిలో దించారు. 16వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెను ఏకంగా 374 వోట్ల తేడాతో ఓడించి రాజుకు దిమ్మతిరిగేలా చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్గా గెలిచిన గాడిపల్లి భాస్కరు ఛైర్మన్ పదవి కూడా వరించింది. 2014 నుంచి 2020 వరకు ఏకంగా ఆరేళ్లు మున్సిపల్ ఛైర్మన్ పదవి అనుభవించాడు. అవసరం తీరిన తర్వాత బీఆర్ఎస్ నన్ను వదిలేసి బీజేపీలో చేరాడు. ఈ ఎన్నికల్లో ఆయన భార్య గాడిపల్లి కళ్యాణిని బీజేపీ అభ్యర్థిగా బరిలో దించాడు. కానీ వోటర్లు కళ్లు బైర్లు కమ్మేలా షాకిచ్చారు. ఏకంగా 529 వోట్ల తేడాతో ఓడించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గోలి మమత ఆమెపై ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థికి ప్రయోజనం దక్కలేదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చైర్మన్ పదవి అనుభవిం చి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అయిన వ్యక్తికి వోటర్లు బుద్ధిచెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో మల్లెల రాజశ్రీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. ఆ తర్వాత ఛైర్పర్సన్ పదవి దక్కింది. బీఆర్ఎస్ పదవి అనుభవించిన మల్లెల రాజ శ్రీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా భీంగ ల్ మున్సిపాలిటీలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే వోటర్లు ఆమెకు షాకిచ్చారు. ఆమెపై బీఆర్ఎస్ అభ్యర్థి రవి నీలం 75 వోట్ల వోట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.Even if you change parties, you will inevitab




