– తొలి ఇవి- విటారా ఉత్పత్తి ప్రారంభం
– వంద దేశాలకు ఎగుమతి లక్ష్యంగా ఉత్పత్తులు
– గుజరాత్ హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ
గాంధీనగర్,ఆగస్ట్26: భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు భారత అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ స్కూటర్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మారుతీ సుజుకీ కంపెనీ తయారు చేసిన తొలి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు విదేశాల్లోనే అమ్మకాలకు సిద్దం అయ్యింది. దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లోని హన్సల్‌పుర్ మారుతీసుజుకీ మోటార్ ప్లాంట్‌లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. మారుతీ సుజుకీ తొలికారు ఇవిటారా తో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్‌కు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనొ పాల్గొన్నారు. భారత్ స్వాలంబన సాధించేందుకు చేస్తోన్న ప్రయత్నాలకు ఇది ప్రత్యేకమైన రోజు. ఇక్కడ ఉత్పత్తి కానున్న కార్లు 100 దేశాలకు ఎగుమతి కానున్నాయని ఈ కార్యక్రమానికి ముందు మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇవిటారా తొలికారు యూకేకు ఎగుమతి కానుంది. తొషిబా, డెన్సో, సుజుకీసంస్థల భాగస్వామ్యంతో ఆ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారుకానున్నాయి. దాంతో 80 శాతం బ్యాటరీ దేశీయంగా సిద్ధం కానుంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన తొలి విద్యుత్ కారు ఇ-విటారా జనవరిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా భారత్‌ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ అప్పుడు వెల్లడించారు. మారుతీ సుజుకీ ఇ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. 49 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తున్న కారు 144 హెచ్‌పీ శక్తిని, 189 కప టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 61 బ్యాటరీ 174 బీహెచ్‌పీని 189 కప టార్క్‌ను విడుదల చేస్తుందని తెలుస్తోంది. అతిపెద్ద బ్యాటరీ వేరియంట్ 500 కిలోటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రదర్శించిన వీడియోలో పేర్కొంది. భారత్‌లో ఇ-విటారా తయారీకి రూ.2,100 కోట్లు వెచ్చించినట్లుమారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ హిసాషి టకేయుచి గతంలో తెలిపారు. మారుతీ సుజుకీ ఈవీలు కొనుగోలు చేసేవారికి స్మార్ట్ హోమ్ ఛార్జర్, ఇన్‌స్టలేషన్ సపోర్ట్‌ను అందించనున్నట్లు తెలిపారు. తొలిదశలో 100 ప్రధాన నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను అందించనున్నట్లు వివరించారు. ప్రతి 5-10 కిలోటర్లకు మారుతీ సుజుకీ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





