మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం

– ప్రదానం చేసిన ఆ దేశ ప్ర‌ధాని డాక్ట‌ర్ అబి అహ్మ‌ద్‌

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 17: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం వరించింది. అదిస్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని డాక్టర్‌ అబి అహ్మద్‌ అలీ ది గ్రేట్‌ ఆనర్‌ ఆఫ్‌ నిషాన్‌ ఆఫ్‌ ఇథియోపియా అవార్డుతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ భారతీయులందరి తరఫునా ఈ అవార్డు స్వీకరిస్తున్నానన్నారు. భారత్‌`ఇథియోపియా బంధాలను పటిష్ఠం చేసేందుకు సహకరించిన ఎందరో భారతీయులకు ఇది గుర్తింపు అని అభివర్ణించిన మోదీ ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్‌ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. తన తొలి ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఇథియోపియా రాజధాని అదిస్‌ అబాబాకు మోదీ చేరుకున్నారు. అంతకముందు విమానాశ్రయంలో ఆయనకు అబీ అహ్మద్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య పరస్పర ప్రయోజనకర విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇథియోపియాకు వెళ్లడానికి ముందు మోదీ జోర్డాన్‌ దేశంలో పర్యటించారు. ఆ దేశ రాజధాని అమ్మాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న ఐదేళ్లలో భారత్‌`జోర్డాన్‌ ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని రెట్టింపు చేసి 500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునేలా ప్రయత్నిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం వహించి లబ్ది పొందాలని ఆ దేశ వాణిజ్య సంస్థలను కోరారు కార్యక్రమంలో ఆ దేశ యువరాజు హుసేన్‌ సహా వాణిజ్య, పరిశ్రమల శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *