బీసీ గురుకులాలకు స్థల సేకరణ చేయాలి

నల్గొండలో బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం

నల్గొండ, జులై 12: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాలకు డిమాండ్‌ బాగా పెరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నల్గొండలో శనివారం జరిగిన బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. 327 బీసీ గురుకులాలకుగాను 26 గురుకులాలకు మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయని, 301 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ గురుకులాలకు కలెక్టర్లు స్థల సేకరణ చేయాలని ఆదేశించారు. స్థల సేకరణ చేయగానే భవన నిర్మాణాలు చేపడతామన్నారు. గురుకులాల్లో మెస్‌ చార్జీలు కాస్మెటిక్‌ చార్జీలు పెంచామని, టీచర్ల నియామకాలు చేపట్టామని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పాఠశాలలు ప్రారంభమైన రోజే అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 21 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, అవసరమైనచోట విద్యార్థుల సంఖ్యను పెంచి వసతి సౌకర్యాలు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా, ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఇందుకు సంబంధించి రూ.6400 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని, ఆర్టీసీలో 3031 పోస్టులకు నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. 1930లో ఏర్పడిన నార్కట్‌పల్లి బస్సు డిపోను దశల వారీగా విస్తరిస్తామని, ఆర్టీసీ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. నల్లగొండలో 77 బస్సులకు గాను 40 బస్సులు ఈరోజు ప్రారంభించామని, వారం పది రోజుల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, తెలంగాణలో దాదాపు 500 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభించామని వివరించారు. హైదరాబాద్‌లో మొత్తం ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపించాలని ప్లాన్‌ చేస్తున్నామని, పీఎం ఈ-డ్రైవ్‌ కింద 2800 బస్సులు మంజూరు చేశాంని, హైదరాబాద్‌ నగరంలో భవిష్యత్తు అంతా ఈవి బస్సులదేనని, కరీంనగర్‌ తరువాత నల్లగొండ జిల్లాలో రూ.8 కోట్లతో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేశామని చెప్పారు.

రోడ్‌ సేఫ్టీ అవేర్నెస్‌ కార్యక్రమం 

నల్లగొండలో ప్రతి నెలా 35- 40 రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అనేకమంది చనిపోతున్నారని, బ్లాక్‌ స్పాట్స్‌ మూసివేస్తున్నామని మంత్రి పొన్నం రోడ్డు నిబంధనలు పాటించకుండా నిరక్ష్యంగా వాహనాలు నడిపే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నామని, ఏఐ ద్వారా వాహనాల ఫిట్నెస్‌ చెకప్‌ జరుగుతుందని, దేశంలో ఇప్పటికే అమలువుతున్న వాహన సారథిని రాష్ట్రంలో ఇటీవల అమలు చేశామని చెప్పారు. ఆటోమేటెడ్‌్‌ డ్రైవింగ్‌ స్టేషన్‌ను త్వరలో తీసుకొస్తామని, గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాలు అందిస్తున్నామని, ప్రభుత్వ స్థలాల్లో తిరిగి ఆదాయం ఇచ్చే 40 లక్షల తాట,ి ఈత మొక్కలు నాటుతున్నామని, ఇప్పటికే నర్సరీలలో మొక్కలు పెంచుతున్నామని చెప్పారు. ఈ జిల్లాలో తాటి, ఈత చెట్లు ఎక్కువగా ఉన్నందున కాటమయ్య రక్షక కవచాలు అధికంగా ఇస్తున్నామన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రైతులకు రూ.2 లక్షల లోపు రుణ మాఫీ, 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇటీవల తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా నిధులు ఇచ్చామని వివరించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, కోదాడ, హుజూర్‌నగర్‌ బస్‌ స్టేషన్లను ఆధునికీకరించామని, త్వరలో మిర్యాలగూడ, నకిరేకల్‌ బస్‌ స్టేషన్‌లు పునరుద్ధరిస్తామని,
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని మంత్రి పొన్నం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *