పారిశ్రామికవేత్తలుగా మహిళా సంఘ సభ్యులు

– మహిళా భవన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: :మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని, 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్‌లో రూ.93.50 లక్షలతో నిర్మించిన మహిళా భవన్‌ను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలతలు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరయ్యారు. అలాగే రూ.30లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సోదరీమణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో పొన్నం అన్న సారథ్యంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. వైఎస్సార్‌ హయాంలో మహిళలను పావలా వడ్డీతో లక్షాధికారులను చేశారని, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ పెట్రోల్‌ బంకులు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కుట్టు మిషన్‌లు, పిల్లలకు మహిళా సంఘాలు ద్వారా బట్టలు కుట్టించే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆమె వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు ఇన్సూరెన్స్‌ వల్ల సభ్యులు ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే రూ.10 లక్షల బీమా ఇస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు యూనిఫాం ఉండాలని చేనేత కార్మికులకు పని కల్పించి ఒక్కో మహిళకు రెండు చీరలు అందిస్తున్నామన్నారు. పోషణ మాసం ప్రారంభించామని, గర్భిణులు మంచి బలవర్థకమైన ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గతంలో అంగన్వాడీ టీచర్లకు సెలవులు ఉండకపోయేది.. వేసవిలో కూడా హాలిడేస్‌ ఇచ్చామని, అంగన్వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌ శిక్షణ ఇచ్చామని, ఈ కేంద్రాల్లో గర్భిణుల కోసం బల్లలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రెండు రోజుల్లో పెండిరగ్‌లో ఉన్న ఆర్పీల జీతాలు వేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *