మున్సిప‌ల్ పోరులో ఒంటిగానే బ‌రిలోకి

– బీజేపీ నాయ‌కుడు కాదూరి యాచ‌య్య‌

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 13: దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ కి దక్కింద‌ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ బోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. పట్టణంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అన్ని పట్టణ ప్రజలు బిజెపి కి ఓటు వేసి మా కార్యకర్తలను ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామ‌న్నారు.పట్టణంలోని అన్ని వార్డుల్లో బిజెపి పోటీ చేస్తుంది ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన బీజేపీకి లేద‌ని స్ప‌ష్టం చేశారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుంది ఉన్నారు.  కచ్చితంగా యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా భానుచందర్, కార్యదర్శి దొమ్మాట ప్రభాకర్, పలుగుల సురేష్ ,సీనియర్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, బందరపు మల్లేష్, బోడ సురేష్ ,శివరాత్రి శ్రీశైలం, ఆకుల దేవేందర్, వంశీ, అనిల్, శివ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *