– యువత కొత్త ఆలోచనలతో రావాలి
– మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్12: యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. రాయదుర్గం టీ హబ్‌లో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కష్టపడాలన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త విధానం తెచ్చినట్లు వివరించారు. వీటి ద్వారా స్యం శక్తులుగా ఎదగాలన్నారు. అంకుర పరిశ్రమలు రూ.వంద కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలి. స్టార్టప్‌లకు సాయం చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇతర దేశాల్లోని అవకాశాల కోసం చూడవద్దు. ఇతర దేశాలు మనపై ఆధారపడే స్థితిక మనం ఎదగాలని శ్రీధర్‌బాబు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





