కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

– ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం

శ్రీనగర్, ఫిబ్రవరి 23 : జమ్మూకశ్మీర్‌లోని కిస్ట్‌వార్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఎ మహమ్మద్ కోసం పనిచేస్తున్నారని భద్రతాబలగాలు గుర్తించాయి. మంచుతో నిండిన ఛత్రూ అడవుల్లో ఓ కొండ దిగువన గల మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఆ స్థావరాన్ని చుట్టుముట్టాయి. భద్రతా బలగాలు లొంగిపోవాలని హెచ్చరించగా తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆ ఇంట్లో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది, జేఈఎం కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *