– 15 మంది మావోయిస్టుల మృతి
– సారండా ఏజెన్సీలో ఎదురుకాల్పులు
-మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యడు అనల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : జార్ఖండ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జిల్లాలోని కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, సీర్పీఎఫ్ కోబ్రా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో, బలగాలు దీటుగా ప్రతిఘటించాయి. ఈ ఎకౌంటర్15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఏవోబీలో నక్సల్స్ ఏరివేత ప్రక్రియ చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సహా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు సైతం జల్లెడపడుతున్నాయి.
మృతుల్లో అగ్రనేత అనల్
ఈ భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేతలు మృతిచెందినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝి అలియాస్ అనల్ ఉన్నట్లు తెలుస్తోంది. అనల్ తలపై ఆరు రాష్ట్రాలలో మొ త్తంగా రూ.5 కోట్లకు పైగా రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు ఆర్గనైజేషన్లో అనల్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలు స్తోంది. భద్రతా బలగాలపై దాడులకు సంబంధించి స్కెచ్ వేయడంలో అనల్ దిట్ట అని తెలుస్తోంది. అనల్ అలియాస్ పతిరామ్ మాంఝి (సీసీఎం) రివార్డ్: రూ.1 కోటి (జార్ఖండ్), రూ.1 కోటి 20 లక్షలు (ఒరిస్సా). రూ.15 లక్షలు మొత్తం కేసులు: 149 చిరునామా: ఎస్.ఝరాహా, పిర్తాండ్ పోలీస్ స్టేషన్, గిరిదిహ్ జిల్లా, జార్ఖండ్. అన్మోల్ అలియాస్ సుశాంత్: రివార్డ్: రూ.25 లక్షలు (జార్ఖండ్), రూ.65 లక్షలు (ఒరిస్సా) మొత్తం కేసులు: 149. అమిత్ ముండా (ఆర్సీఎం) రివార్డ్: రూ.15 లక్షలు (జార్ఖండ్), రూ.43 లక్షలు (ఒరిస్సా), రూ.4 లక్షలు, మొత్తం కేసులు: 96. పింటు లోహరా : రివార్డ్: రూ.5 లక్షలు (జార్ఖండ్) మొత్తం కేసులు: 47 లాల్జిత్ అలియాస్ లాలూ: రివార్డ్: రూ.5 లక్షలు (జార్ఖండ్) చిరునామా: ధరణాదిరి, కిరిబురు పోలీస్ స్టేషన్, చైబాసా జిల్లా. రాజేష్ ముండా : మొత్తం కేసులు: 14 చిరునామా: మెయిల్పిడి గ్రామం, అడ్కి పోలీస్ స్టేషన్, ఖుంటి జిల్లా. బుల్బుల్ అల్డా : మొత్తం కేసులు: 8 చిరునామా: ఎలిగర్ల గ్రామం, తంత్నగర్ పోలీస్ స్టేషన్, చైబాసా జిల్లా, బబిత : మొత్తం కేసులు: 16, చిరునామా: కొర్ర గ్రామం, కుచాయి పోలీస్ స్టేషన్, సరైకేలా జిల్లా, పూర్ణిమ: మొత్తం కేసులు: 5 చిరునామా: ఇచాగోడ గ్రామం, గోయికెర పోలీస్ స్టేషన్, చైబాసా జిల్లా, సురాముని, (కేడర్) మిగిలిన నలుగురు నక్సలైట్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఘటనకు సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడిస్తామని భద్రతా అధికారులు తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు పారిపోయినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





