గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్

– ముగ్గురు మావోయిస్టుల మృతి
– భద్రతా బలగాల కమాండో కూడా..

రాయపూర్, ఫిబ్రవరి 6: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా పొదవాడ అడవుల్లో జరిగిన ఈ సంఘటనలో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు గురువారం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు అడవిలోకి ప్రవేశించగానే మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ హోరాహోరీ పోరులో కమాండో దీపక్ ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో అధికారిని మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనాస్థలిలో ఏకే`47, ఎసఎలఆర్, ఆయుధాలు, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఇంకా కొందరు మావోయిస్టులు దాగి ఉండే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో గడ్చిరోలి జిల్లాలో ఉద్రిక్తÁ వాతావరణం నెలకొంది. స్థానికులను అప్రమత్తం చేసిన అధికారులు అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని సూచనలు జారీ చేశారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నందున ఎంతమంది చనిపోయారనేది నిర్ధారించలేమని, తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *