ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టులు మృతి
‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని అటవీప్రాంతంలో కొన్నిరోజులుగా కాల్పుల మోత కొన‌సాగుతోంది. బీజాపుర్‌ ‌జిల్లాలోని నేషనల్‌ ‌పార్క్‌లో భద్రతా బలగాలు చేతిలో  మూడోరోజు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీహైడ్రేషన్‌, ‌పాముకాటు, తేనెటీగలు దాడి చేయడంతో కొందరు జవాన్లకు అస్వస్థత కలిగింది. గాలింపు సమయంలో మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. గత మూడు రోజులుగా నేషనల్‌ ‌పార్క్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ ‌కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

గడిచిన రెండు రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్‌, ‌భాస్కర్‌ ‌మృతి చెందారు. సుధాకర్‌పై రూ.కోటి, భాస్కర్‌పై రూ.25లక్షల రివార్డ్ ఉం‌ది. ప్రస్తుతం ఆపరేషన్‌ ఇం‌కా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి.80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నేషనల్‌ ‌పార్క్ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు సురక్షిత ప్రాంతంగా భావించారు.  నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలుస్తున్న‌ది. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, ‌కోబ్రా దళాలు పాల్గొన్నాయి. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్‌మడ్‌ ‌పర్వతాలతోపాటు నేషనల్‌ ‌పార్కులో అణువణువూ జల్లెడ పడుతుండటంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *