– ఆరుగురు మావోయిస్టుల మృతి
రాయపూర్, నవంబర్ 11: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధ సామగ్రిని భద్రతా బల గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడిరచారు. నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న బీజాపూర్, దంతెవాడ, డీఆర్ జీ, ఎస్‌ఎఫ్ సంయుక్త బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది.ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలు ఇన్సాస్, స్టోన్గన్లు, 303 రైఫి ళ్లు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జితేం ద్ర తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టు కదలికలు ఉన్నట్లు తెలిసిందని, అదనపు బలగాలను అక్కడికి పంపుతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగు తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గరియాబంద్ జిల్లాలో నాలుగు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





