బీజాపూర్ ఎన్ కౌంటర్ లో 20మంది మృతి

వివరాలు వెల్లడించిన డీఐజీ కమలోచన్ కశ్యప్

రాయపూర్, డిసెంబరు 4: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపుర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 9 మం ది మహిళలతో సహా మొత్తం 20 మంది మా వోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుం దర్ రాజ్ తెలిపారు. బీజాపూర్ లో డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ కలిసి ఎన్ కౌంటర్ వివరాలను గురువారం వెల్లడించారు. ఎన్ కౌంటర్ నుం చి ప్రాణాలతో బయటపడిన మావోయి స్టులు త్వరగా లొంగిపోతే మంచిదని, లేకుంటే ప్రా ణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుం దని హెచ్చరించారు. కాల్పుల్లో మృతి చెం దిన వారిపై రూ.1.3 కోట్ల రివార్డు ఉందని చెప్పారు. మృతుల్లో మావోయిస్టు పీఎల్జీ రెం డో బెటాలియన్ కమాండర్ వెల్ల మోడియంతోపాటు కంపెనీ నెంబర్ 2, 7లకు చెందిన కీలక మావోయిస్టులు.. రైను ఓఎం, సన్ను అవలం, నందా డియం, లాలు, రాజు పూణెం, రమేష్ కవాసి, లక్ష్మీ తాటి, బండి, మద్వి, సుకీ లేఖం, సోమి కుంజం, చందు కుర్మం, మాసే, రీనా మార్కం, సోనీ మద్వి, సంగీత పద్దంగా గుర్తించామన్నారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. బస్తర్ పరిధిలో గత 19 నెలల్లో వివిధ ఎన్కౌం టర్లలో 469 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఐజీ వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *