– 15మంది మావోయిస్టులు మృతి
– ముగ్గురు జవాన్లు మృతి, ఇద్దరికి గాయాలు
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకులమోత మోగింది. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 15మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ముగ్గురు జవాన్లు కూడా మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేశ్‌కుతుల్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇది మావోయిస్టులకు మళ్ళీ కోలుకోలేని దెబ్బ. ఈ ఆపరేషన్‌లో చత్తీస్‌గఢ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కోబ్రా యూనిట్ కలిసి పనిచేశాయి. ఘటనా స్థలాల నుండి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి, వీటిలో రెండు ఏకె-47,303 రైఫిల్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద మొత్తంలో బుల్లెట్లు, పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయి. అటవీ ప్రాతాన్ని జల్లెడ పడుతున్నట్లు బస్తర్ రేంజ్ డిఐజి సుందర్‌రాజ్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.