గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

ముంబై,సెప్టెంబర్‌ 17: ‌మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎటపల్లి తాలూకాలో మోదస్కే గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో మావోయిస్టుల గట్టా లాస్‌ ‌సభ్యులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది.. అ•్ర మత్తమైన భద్రతబలగాలు, పోలీసులు కూంబింగ్‌ ‌నిర్వహి ంచాయి. గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక యాంటీ మావోయిస్టు కమాండో స్క్వాడ్‌ ‌సీ60 ఐదు యూనిట్లతో పాటు, అహేరి నుంచి సీఆర్పీఎఫ్‌ ‌బృందం వెంటనే సెర్చ్ ఆపరేషన్‌ ‌చేపట్టింది. ఈక్రమంలో మావోయిస్టులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచి ఆటోమేటిక్‌ ఏకే 47 రైఫిల్‌ ‌సహా పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈప్రాంతంలో నక్సల్‌ ‌వ్యతిరేక కూంబింగ్‌ ‌కార్యకలా పాలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *