రాయపూర్, సెప్టెంబర్ 22: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మరో ఎన్‌కౌం టర్ జరిగింది. ఇందులో ఇద్దరు అగ్రనేత లు హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతి చెందారు. మృతులను మావో యిస్టు కేంద్ర క మిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్ కోసాగా గుర్తించారు. ఘటనా స్థలిలో ఏకే 47, ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌం టర్‌ను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అభుజ్‌మాద్ అడవుల్లో సోమవారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు అధికా రులు చెప్పారు. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ జరుపుతుం డగా కాల్పులు చోటుచేసుకున్నట్టు చెప్పారు.మావోయిస్టుల సంచారంపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిం చాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు.
ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరే.. : ప్రజాసంఘాలు
అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ముందు గానే వీరిని పట్టుకొని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపినట్లు ప్రజా వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఛత్తీస్ గఢ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 249 మంది నక్సలైట్లు హతమయ్యారు. వీరిలో 220 మందిని ఒక్క బస్తర్ డివిజన్‌లోనే బలగాలు మట్టుబెట్టాయి
—————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





