ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

– న‌లుగురు మావోయిస్టుల మృతి – కొంతమందికి గాయాలు

– భారీగా ఆయుధాలు స్వాధీనం

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. ఈ సంఘటనలో న‌లుగురు మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌, ‌దంతెవాడ, బీజాపూర్‌ ‌సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం నాడు మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారం తెలుసుకున్న భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి కూంబింగ్‌ ‌చేస్తూ ప్రవేశించారు. వీరిని గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగటంతో భద్రత బలగాలు ఎదురుదాడిచేసారు. ఈ సంఘటనలో న‌లుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది మావోయిస్టులకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. వీరి కోసం భద్రత బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. సంఘట స్థలం వద్ద భారీగా ఆయుదాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం భద్రత బలగాలు అన్వేశిస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *