రాయ్‌పూర్, జనవరి 29: ఛత్తీస్‌గఢ్ మరోమారు రక్తమోడింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లా దక్షిణ భాగంలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 7గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి ఇద్దరు మావోయిస్టుల మతదేహాలను, ఎకె47 రైఫిల్, 9ఎంఎం పిస్టల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. జనవరి 3న బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో సుమారు 22మంది మావోయిస్టులు మరణించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





