ఆరుగురు మావోయిస్టులు మృతి

– భారీగా ఆయుధాలు స్వాధీనం
– ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత?

భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 18 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ ‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే నారాయణ్‌పూర్‌ ‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారంతో భద్రత దళాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. భద్రత దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరుపడంతో భద్రత దళాలు ఎదురుకాల్పులు జరుపగా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి వద్ద నుండి ఏకె47, ఎస్‌ఎల్‌ఆర్‌ ‌రైఫిల్స్ ‌, ఇతర ఆయుధాలు,పేలుడు పదార్ధారాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక రోజువారి ఉపయోగించే వస్తువులను కూడ స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *