పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆద్వర్యంలో పనుల జాతరతో పల్లెల్లో సందడి వాతవరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గత ఏడాది పనుల జాతరలో చేపట్టి పూర్తి చేసిన పనులకు ప్రారంభోత్సవాలు, నూతన పనులకు శంకుస్థాపనలు చేసారు. మహబూబాబాద్ జిల్లా లో పనుల జాతరను మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు ఉపాధి, పల్లెల్లో ప్రగతి లక్ష్యంగా ఈ దఫా రూ.2198 కోట్లతో పనుల జాతర గ్రామాల్లో లక్షకు పైగా పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది
పల్లెల్లో ప్రారంభమైన పనుల జాతర



