సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఉద్యోగులకు ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తదితర సంఘాల నాయకులు, ఉద్యోగులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు పథకాలూచరిత్రలో నిలిచిపోతాయని ప్రశంసించారు. 652 గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలకు అవకాశాలు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *