విద్యుత్‌ చట్టంతో రైతులు, పేదలకు నష్టం

– నాలుగు లేబర్‌ కోడ్‌లు తేవడం దుర్మార్గం
– ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేసే ఆరావళి విధ్వంసాన్ని ఆపాలి
– ప‌లు అంశాల్లో కేంద్రం తీరుపై రాఘ‌వులు ఆగ్ర‌హం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ప్రభుత్వ అధీనంలో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థలు డిస్కంలను ప్రైవేటుపరం చేసేందుకే మోదీ ప్రభుత్వం విద్యుత్‌ సవరణ చట్టం తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జ్యోతితో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్‌ చట్టం వల్ల క్రాస్‌ సబ్సిడీ ఎగిరిపోతుందని, రైతులు, పేదలు ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని కోల్పోతారని వివరించారు. అదాని, అంబాని, గోద్రెజ్‌, సుజాన్‌ వంటి విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు పంపిణీ వ్యవస్థను తమకివ్వాలని ఎప్పటినుంచో ఒత్తిడి తేవడంతోనే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. తెలంగాణలో మూడో డిస్కమ్‌ ఏర్పాటును తప్పుబట్టారు. నిన్న‌టి పార్లమెంటు సమావేశాల్లో దేశానికే అత్యంత ప్రమాదకరమైన నాలుగు చట్టాలకు కేంద్రం ఆమోద ముద్ర వేసుకుందని, వాటి పరిణామాలు దేశ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయని హెచ్చరించారు. వాటికి వ్యతిరేకంగా కలిసొచ్చే శక్తులతో దేశవ్యాప్త పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్పొరేట్లు అధిక లాభాలు గడించేలా నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. ’విబి జి ఆర్‌ఎఎంజి’ చట్టం రాష్ట్రాలకు పెనుభారంగా మారబోతోందని, ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాలు 40 శాతం నిధులను ఖర్చు చేయకపోతే కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులను ఆపేస్తుందని తెలిపారు. దేశంలోనే ఎక్కువ పని దినాలను వాడుకుంటున్న తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయని నొక్కిచెప్పారు. ’సబ్‌కా బీమా సబ్‌కా రక్ష కాదు సబ్‌కీ బీమా కరోడ్‌పతికా రక్ష’ అనే ఇన్సూరెన్స్‌ చట్టంలో మార్పులున్నాయని, విదేశీ సంస్థలకు ఇన్సూరెన్స్‌ రంగంలో వంద శాతం పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని మోదీ సర్కారు కల్పించిందని విమర్శించారు. శాంతి పేరుతో తీసుకొస్తున్న న్యూక్లియర్‌ లయబులిటీ బిల్లు విదేశీ సంస్థలు, కంపెనీలు స్థాపించే అవకాశాన్ని కల్పిస్తుందని, ప్రమాదాలు జరిగితే కంపెనీల బాధ్యత కాదని ఆ చట్టంలో పేర్కొనడం దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. నిజమైన దేశభక్తులు ఎన్‌డీఏ, దాని మిత్రపక్షాలు కాదని, దేశ రక్షణ కోసం కొట్లాడుతున్న కమ్యూనిస్టులు, లౌకిక శక్తులు, ప్రజలు అని స్పష్టం చేశారు.దిల్లీికి సవిూపంలోని అరావళి పర్వత శ్రేణుల్లో కార్పొరేట్ల హిల్‌ హౌస్‌లు పెరిగిపోతున్నాయని, పర్యావరణానికి, నీటి వనరులకు ఇది తీవ్ర విఘాతమని సీనీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పర్యావరణ విధ్వంసానికి పరాకాష్ట అన్నారు. ఆరావళి విధ్వంసాన్ని అడ్డుకోకపోతే దేశానికి తీవ్ర ముప్పు తప్పదన్నారు. ప్రకృతి విధ్వంసం తగదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *