చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్‌ లైన్‌ పునరుద్ధరణ

– సాహ‌సం చేసిన లైన్‌మ‌న్‌

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ఆ శాఖ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు నేలకొరిగినా, వైర్లు తెగిపడినా గంటల్లో మరమ్మతులు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన విద్యుత్‌ లైన్‌ను పునరుద్ధరించేందుకు లైన్‌మన్‌ హైముద్దీన్‌ సాహసం చేశారు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి విద్యుత్‌ లైన్‌ను పునరుద్ధరించారు. అతని సాహసానికి ప్రజలు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *