– తెలంగాణలో సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల స్థానాలు ఖాళీ
– మార్చి 16న ఎన్నికల నిర్వహణ
న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: పది రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నది. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను విడుదల చేసింది. తెలంగాణ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ 9న ఆ ఇద్దరి పదవీకాలం ముగియనున్నది. ఇక మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఏడుగురు తమ పదవీకాలాన్ని ఏప్రిల్ 2న పూర్తి చేసుకోనున్నారు. ఒడిశాలో నలుగురు, తమిళనాడులో ఆరుగురు, బెంగాల్‌లో అయిదుగురు, అస్సాంలో ముగ్గురు, బీహార్‌లో అయిదుగురు, ఛత్తీస్‌గఢ్, హర్యానాల్లో ఇద్దరేసి, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక సీటు కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు చెందిన నోటిఫికేషన్ 26న విడుదల చేయనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 9వ వరకు దరఖాస్తులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు పక్రియ ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





