బెంగాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

– ఈసీ ఆదేవాల మేరకే ఉద్యోగులు పనిచేయాలి
– అర్హులైన ఏ ఒక్కరి పేరూ తొలగించలేదు
– ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేశ్‌ ‌కుమార్‌

‌కోల్‌కతా,మార్చి10: వోటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క వోటరును తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఎన్నికల పక్రియలో  ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి లోటుపాట్లను సహించేది లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో వరుస సమావేశాల అనంతరం డియాతో సీఈసీ మంగళవారం మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో 80,000 పోలింగ్‌ ‌స్టేషన్లు ఉన్నాయని, వీటిలో 61,000 బూత్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని సీఈసీ చెప్పారు. వోటింగ్‌ ‌పక్రియలో పారదర్శకత, అవకతవకల నిరోధానికి అన్ని పోలింగ్‌ ‌బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ ‌పక్రియ అమలు చేస్తామని తెలిపారు. రాజ్యంగం ప్రకారమే ఎస్‌ఐఆర్‌ ‌పక్రియ నిర్వహించామని, పూర్తిగా పారదర్శకతంగా జరిగిందని తెలిపారు. దిల్లీ వెళ్లిన తర్వాత ఎన్నికల కమిషన్ ‌సమీక్షా సమావేశం జరుపుతుందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో  హింస మరియు బెదిరింపులకు తావు లేకుండా  ఎన్నికలు జరిగేలా  చూడటమే తమ ప్రధాన లక్ష్యమని జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఈసీ రెండు రోజుల పాటు సక్ష సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని చట్ట అమలు సంస్థలు భయం లేదా పక్షపాతం లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వోటింగ్‌ ‌శాతం అధికంగా ఉందని, వోటర్లు,  ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవిస్తారని అన్నారు. శాంతియుతంగా, స్వేచ్ఛాయుతమైన వాతవారణంలో పోలింగ్‌ ‌జరిగేలా చూడాలని వోటర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఎన్నికల ఏర్పాట్లను సక్షించేందుకు వచ్చిన సీఈసీకి మంగళవారంనాడు కూడా నిరసనల సెగ తప్పలేదు. మంగళవారం ఉదయం దక్షిణెళిశ్వర్‌ ‌కాళి ఆలయాన్ని సందర్శించేందుకు ఆయన వచ్చినప్పుడు కొందరు నల్లజెండాలతో నిరసన తెలుపుతూ ’గో బ్యాక్‌’ ‌నినాదాలు చేశారు. ఆదివారం రాత్రి సీఈసీ రాక సందర్భంగా నేతాజి సుభాష్‌ ‌చంద్రబోస్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయం బయట కూడా ఇలాంటి నిరసన ప్రదర్శనలు చేటుచేసుకున్నాయి. ఎస్‌ఐఆర్‌ ‌పక్రియ అనంతరం విడుదల చేసిన ఓటర్ల తుదిజాబితా నుంచి పక్షపాత ధోరణితో పెద్దఎత్తున పేర్లు తొలగించారని నిరసన ప్రదర్శకులు ఆరోపిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *