– సీఎం అభ్యర్థనకు హైకోర్టు తిరస్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు కాగా వాటిని రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





